సీఎస్కేతో మ్యాచ్... టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్

  • చెన్నైతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్
  • తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్న హార్దిక్ పాండ్యా
  • తాము కూడా బ్యాటింగ్ చేయాలనే అనుకున్నామన్న రుతురాజ్
  • ఇరు జట్లలో కీలక మార్పులు.. కొత్త ఆటగాళ్లకు అవకాశం
  • చెపాక్ స్టేడియం వేదికగా ఐపీఎల్ 44వ మ్యాచ్
ఐపీఎల్ 2026లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య కీలక పోరుకు రంగం సిద్ధమైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
టాస్ గెలిచిన అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. "మేము మొదట బ్యాటింగ్ చేయబోతున్నాం. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో మా బ్యాటర్లు రాణించిన తీరుతో వారికి మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. ఆత్మగౌరవం కోసం కూడా పోరాడాల్సి ఉంది. ఉత్తమ ప్రదర్శన కనబరుస్తాం" అని తెలిపాడు.

మరోవైపు చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. "మేము కూడా టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేయాలనే అనుకున్నాం. వికెట్ కొద్దిగా పొడిగా ఉన్నప్పటికీ, పెద్దగా మారకపోవచ్చు. గత మ్యాచ్‌లో ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం కష్టంగా అనిపించింది. జట్టులో అందరూ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు" అని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ కోసం చెన్నై జట్టులో గుర్జప్‌నీత్ సింగ్ స్థానంలో రామకృష్ణ ఘోష్, అకీల్ హొసేన్ స్థానంలో ప్రశాంత్ వీర్ జట్టులోకి వచ్చారు.

ఇరు జట్ల వివరాలు:
చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, డివాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, ముఖేష్ చౌదరి.
ముంబై ఇండియన్స్: విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, క్రిష్ భగత్, జస్ప్రీత్ బుమ్రా, ఏఎం ఘజన్ఫర్.

Hardik Pandya
Mumbai Indians
Chennai Super Kings
IPL 2026
Ruturaj Gaikwad
MI vs CSK
Chepauk Stadium
Indian Premier League
Cricket Match
Toss

More Telugu News